విజయ్ దేవరకొండ ఫైటర్ ఫస్ట్ లుక్...!
By: Anji Tue, 08 Dec 2020 12:45 PM
పూరి – విజయ్ దేవరకొండ కలయికలో ఫైటర్ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ కి తెలుగు తో పాటు హిందీ లోను మంచి పాపులార్టీ ఉండడం తో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కామ్ డిస్ట్రబ్యూటర్ కరణ్ జోహార్ హిందీ లో ఫైటర్ ను రిలీజ్ చేయబోతున్నాడు.
ఈ సినిమా తో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.లాక్‌డౌన్ వలన ఆగిన ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికీ రీస్టార్ట్ కాలేదు. కోవిడ్ సమస్యల మూలాన విదేశీ ఫైటర్లు దొరక్కపోవడంతో సినిమా ఆలస్యమైనట్లు టాక్.
అయితే.. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారమైందట. ముంబైలోనే గత కొద్దీ రోజులుగా ఉంటున్న పూరి.. సమస్యలను క్లియర్ చేసుకున్నారట. దీంతో ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి మొదలు కానుంది. అలాగే సంక్రాంతికి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే ఆలోచన చేస్తుందట.