Advertisement

  • కొత్త సినిమా షురూ చేసిన టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్

కొత్త సినిమా షురూ చేసిన టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్

By: Sankar Mon, 28 Dec 2020 1:43 PM

కొత్త సినిమా షురూ చేసిన టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్


టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మరొక కొత్త సినిమా ప్రారంభించాడు..ఈ నగరానికి ఏమైంది , ఫలక్ నుమా దాస్ , హిట్ వంటి సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్ టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు..అందులో భాగంగా తమిళ్‌లో సూపర్ హిట్ అందుకున్న ‘ఓ మై కడవులే’ సినిమా తెలుగు రీమేక్‌లో చేసేందుకు సిద్దమయ్యాడు.

ఈ సినిమా పూజా కార్యక్రమాలతో నేడు షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాకు అశ్వత్ దర్శకత్వం చేయనున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ మాటలు, డైలాగ్‌లను అందించాడు. ఈ చిత్రం రీమేక్‌కు కావలసిన రైట్స్‌ను పీవీపీ సినిమాస్ సొంతం చేసుకుంది.

ఇప్పడు విశ్వక్ హీరోగా సినిమా చేసేందుకు రెడీగా ఉంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా అంచనాలను దాటుతుందా అనేది వేచి చూడాలి.

Tags :
|

Advertisement