టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్
By: Sankar Sun, 04 Oct 2020 1:26 PM
కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా ఈ వైరస్ అందరికీ సోకుతోంది.
ఇప్పటికే చాలా మంది ప్రముఖులకు కరోనా సోకింది. తాజాగా ప్రముఖ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా బారిన పడ్డారు. హైఫీవర్ తో బాధపడుతున్న తమన్నా ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఆగష్టు చివరి వారంలో తమన్నా తల్లిదండ్రులు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. షూటింగ్ లకు అనుమతి ఇచ్చినప్పటి నుంచి తమన్నా షూటింగ్ లలో పాల్గొన్నారు. ప్రస్తుతం తమన్నా చేతిలో గుర్తుందా శీతాకాలం, సిటీమార్, అంధధూన్ రీమేక్‌తో పాటు ఓ వెబ్ సిరీస్ ఉన్నాయి.