Advertisement

  • టాలీవుడ్ లో మరొక స్టార్ హీరోయిన్ కుటుంబానికి కరోనా

టాలీవుడ్ లో మరొక స్టార్ హీరోయిన్ కుటుంబానికి కరోనా

By: Sankar Mon, 26 Oct 2020 1:52 PM

టాలీవుడ్ లో మరొక స్టార్ హీరోయిన్ కుటుంబానికి కరోనా


కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికింది . సామాన్యులు సెలబ్రిటీలు అందరు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే వేలల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక సినిమా తారలు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది.

బాలీవుడ్ స్టార్స్ చాలా మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. మరికొంతమంది చికిత్స తీసుకుంటున్నారు. టాలీవుడ్ లో సీనియర్ హీరో రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడింది. మిల్కీ బ్యూటీ ఫ్యామిలీకి కూడా కరోనా సోకింది. ఆతర్వాత తమన్నా కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇటీవలే తమన్నా కరోనా నుంచి బయట పడింది. ఈ నేపథ్యంలో నటి ఛార్మి కౌర్ కుటుంబం కూడా కరోనా బారిన పడ్డట్టు తెలుస్తుంది. ఆ విషయాన్ని స్వయంగా ఛార్మి వెళ్లడించింది.

తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా అంటూ నిర్థారణ అయిన వెంటనే అమ్మానాన్న ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. వారికి కోవిడ్ అని తెలిసి చాలా బాధపడ్డాను. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. త్వరలోనే వారు కరోనాను జయించి ఆరోగ్యంతో చూడాలని ఆశిస్తున్నాను. అంటూ పేర్కొంది.

Tags :
|

Advertisement