టాలీవుడ్ లో తీవ్ర విషాదం ...ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ మృతి
By: Sankar Thu, 31 Dec 2020 10:21 PM
టాలీవుడ్ లో మరొక ప్రముఖ నటుడు మృతి చెందాడు ..విలన్ గా , కమెడియన్ గా అభిమానులను ఎంతో అలరించిన ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ (52) కన్నుమూశారు.. చాలా కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ఆయన.. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే మృతిచెందారు.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన నర్సింగ్ యాదవ్.. 300లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు.. ఆయన స్వస్థలం హైదరాబాద్..
ఆయన అసలుపేరు మైలా నరసింహ యాదవ్... ఇండస్ట్రీలో అందరూ నర్సింగ్ యాదవ్ అని పిలుస్తారు. ఆయనకు భార్య చిత్ర, కొడుకు రిత్విక్ యాదవ్ ఉన్నారు. 300లకు పైగా సినిమాల్లో నటించి కామెడీ విలన్‌గా, విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. రజనీకాంత్ నటించిన బాషాలోనూ మంచి కేరక్టర్ చేశారు..
కిడ్నీ సంబంధిత వ్యాధితి బాధపడుతోన్న ఆయనకు గత కొంతకాలంగా డయాలిసిస్ జరుగుతోంది.. న్యూఇయర్ సమీపిస్తున్న తరుణంలో నర్సింగ్ యాదవ్ మృతి.. టాలీవుడ్‌లో విషాదాన్ని మిగిల్చింది.