మరికాసేపట్లో రజని డిశ్చార్జ్ ..ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్‌లో చెన్నైకు...!
By: Anji Sun, 27 Dec 2020 4:02 PM
రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్న 'అణ్ణాత్తే' సినిమా యూనిట్‌లో నలుగురికి కొవిడ్-19 అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. రజనీకాంత్, దర్శకుడు శివతో పాటు మిగతా వాళ్లకు టెస్ట్‌లో నెగటివ్ వచ్చింది.
దాంతో నిర్మాతలు షూటింగ్ నిలిపివేశారు. చాలామంది యూనిట్ సభ్యులు చెన్నైకి తిరిగి వెళ్లిపోయినా, రజనీ మాత్రం హైదరాబాద్‌లో సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉన్నారు. అయితే ఆయన అస్వస్థతకు గురవడంతో రెండు రోజుల క్రితం స్థానిక అపోలో హాస్పిటల్స్‌లో అడ్మిట్ అయ్యారు.
ఆయన బ్లడ్ ప్రెజర్‌లో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయనీ, అయితే ఆయన ఆరోగ్య స్థితి నిలకడగానే ఉందనీ హాస్పిటల్ వర్గాలు బులెటిన్ జారీ చేశాయి. కాగా రజనీ ఈ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారంలోకి వచ్చింది.
ఆయన సోదరుడు సత్యనారాయణ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, ఈ రోజు సాయంత్రం కానీ, లేదా సోమవారం ఉదయం కానీ రజనీ డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.
తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్ బేగంపేట నుండి తన ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్‌లో సాయంత్రం చెన్నైకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. రజనీకాంత్‌తో ప్రస్తుతం ఆయన కూతురు ఉన్నారు.