Advertisement

  • సినిమా నచ్చడంతో దర్శకుడ్ని పిలిచి అభినందించిన బన్నీ

సినిమా నచ్చడంతో దర్శకుడ్ని పిలిచి అభినందించిన బన్నీ

By: Sankar Fri, 02 Oct 2020 4:23 PM

సినిమా నచ్చడంతో దర్శకుడ్ని పిలిచి అభినందించిన బన్నీ

వెనుకబడిన కులాలకు చెందిన వారిని రాజకీయంగా ఏవిధంగా దోచుకుంటున్నారో కండ్లకు కట్టినట్టు తెరపై చూపించిన సినిమా పలాస 1978. ఈ ఏడాది మొదట్లో ఈ సినిమా థియోటర్లలో విడుదలైంది. అయితే...ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాకు కరుణకుమార్‌ దర్శకత్వం వహించగా...రక్షిత్‌, నక్షత ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీకాకుళం జిల్లాల్లోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. నాటి సమాజంలో కుల, వర్ణ వివక్ష నాటు ఏ విధంగా ఉందో ఈ చిత్రం ద్వారా దర్శకుడు చూపించే ప్రయత్నం చేసి కొంతమేర విజయం సాధించాడు. అయితే.. స్టైలీస్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ ఈ సినిమా దర్శకుడికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

పలాస మూవీ తనకు ఎంతగానో నచ్చిందని బన్నీ పేర్కొన్నాడు. తాను సినిమా చూశానని...వ్యక్తిగతంగా ఎంతో నచ్చిందని, గొప్ప అంతర్లీన సందేశంతో సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని ట్విట్టర్‌ లో తెలిపాడు బన్నీ. ఈ చిత్రాన్ని చూసిన మర్నాడు దర్శకుడిని కలిసి అభినందించినట్లుగా బన్నీ చెప్పాడు

Tags :

Advertisement