‘తల్లి’ పాత్రలో స్టార్ హీరోయిన్
By: chandrasekar Fri, 22 May 2020 3:39 PM
సిమ్రాన్ ఒకప్పటి
స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో తనదైన నటనతో కుర్రకారు హృదయాల్లో
చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో అనేక మంది కొత్తకొత్త
హీరోయిన్లు వెండితెరకు పరిచయం అయ్యారు. సిమ్రాన్ లాంటి స్టార్ హీరోయిన్లు సైడ్
అవుతుంటే అనేక మంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతుండటం
చూస్తున్నాం.
సినిమాపై పచ్చి, ప్రేమ, గౌరవంతో
సపోర్టింగ్ క్యారెక్టర్‌గా నటించేందుకు సిమ్రాన్ సై అంటున్నారు. తాజాగా ఆమె తల్లి
పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం
అందినది. సంతోష్ మోహన్ వీరంకి తెరకెక్కించనున్న కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్
చిత్రంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించనున్నాడు. రాజ్ తరుణ్ తల్లిగా
నటించేందుకు సిమ్రాన్ ‘ఓకే’ చెప్పినట్టు సమాచారం.
లాక్ డౌన్ కారణంగా సిమ్రాన్
ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవల విడుదల చేసిన ఓ వీడియో తెగ వైరల్ అయింది. కొడుకుతో కలిసి ఆమె
డ్యాన్స్‌లు చేస్తున్నారు. సిమ్రాన్ తన చిన్నప్పటి స్నేహితుడు దీపక్‌ను 2003లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
వీరి పేర్లు అదీప్ బగ్గా, అదిత్
బగ్గా. పెళ్లయ్యాక కోలివుడ్ సినిమాల్లో సహాయక పాత్రల్లో సిమ్రాన్ నటించారు.
రియల్ లైఫ్‌లో ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సిమ్రాన్ రియల్ లైఫ్‌లో మరోసారి తల్లి కావడానికి
సిద్ధమయ్యారన్న మాట.