గ్యాప్ ఇవ్వలేదు ..వచ్చింది అంటున్న స్టార్ హీరోయిన్
By: Sankar Wed, 30 Sept 2020 6:37 PM
సౌత్ ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు చక్రం తిప్పిన అనుష్క శెట్టి ‘భాగమతి’ తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ‘బాహుబలి’ తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన అనుష్క ప్రస్తుతం 'నిశ్శబ్దం' అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకులముందుకు రాబోతుంది.
ఈ సినిమా అక్టోబర్ 2న ఓటీటీ వేదికగా ప్రేక్షకులముందుకు రాబోతుంది. కాగా ఈ అమ్మడు బాగమతి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది. త్వరలో విడుదల కాబోతున్న నిశబ్దం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ గ్యాప్ పై స్పందించింది.భాగమతి సినిమా తర్వాత నేను గ్యాప్ తీసుకోవాలనుకోలేదు. కాని అది కొన్ని కారణాల వల్ల వచ్చింది. అనుకోకుండా వచ్చిన గ్యాప్ తో పాటు కరోనా వల్ల మరో ఆరు ఏడు నెలలు గ్యాప్ వచ్చింది.
నిశబ్దం సినిమా పూర్తి అయిన వెంటనే మరో సినిమాను చేయాలని భావించాను. కాని నిశబ్దం ఆలస్యం అవ్వడం వల్ల కొత్త సినిమాను మొదలు పెట్టలేక పోయాను" అని చెప్పుకొచ్చింది స్వీటీ. నిశబ్దం సినిమా విడుదలైన తర్వాత ఈమె రెండు సినిమాలు చేయబోతుంది అనుష్క.