Advertisement

కరోనా ను జయించిన దర్శక ధీరుడు రాజమౌళి

By: Sankar Wed, 12 Aug 2020 6:31 PM

కరోనా ను జయించిన దర్శక ధీరుడు రాజమౌళి



కరోనా బారిన పడిన దర్శక ధీరుడు యస్‌.యస్‌ రాజమౌళి.. ఆయన కుటుంబ సభ్యులు కరోనాను జయించారు. ఇటీవల తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా వచ్చినట్లు ఆయనే స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి క్వారంటైన్‌ ఉన్న ఆయనకు, కుటుంబ సభ్యులకు ఇవాళ(బుధవారం) నిర్వహించిన కోవిడ్‌ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినట్లు ట్విటర్‌ వేదికగా ప్రకటించాడు. ‘రెండు వారాల క్వారంటైన్‌ అనంతరం మాలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించడం లేదు. తాజాగా నిర్వహించిన పరీక్షలో నాకు, నా కుటుంబ సభ్యులకు కరోనా నెగిటివ్‌ వచ్చింది’ అంటూ ట్వీట్‌ చేశాడు.

అయితే ప్లాస్మా దానం కోసం.. తగినంత రోగనిరోధక శక్తి అభివృద్ధికి మరో మూడు వారాల పాటు వేచి ఉండాల్సిన అవసరం ఉందని డాక్టర్‌లు సూచించినట్లు ఆయన తెలిపాడు. రెండు వారాల క్రితం తనకు తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు స్వయం ఆయనే ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘నాకు మా కుటుంబ సభ్యులకు తెలికపాటి జ్వరం వచ్చింది. ఆ తర్వాత అది తగ్గినప్పటికీ కోవిడ్‌ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ తెలింది’’ అంటూ ఆయన ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.

Tags :
|
|

Advertisement