Advertisement

  • పెళ్లి తేదీ ప్రకటించిన స్టార్ సింగర్ సునీత

పెళ్లి తేదీ ప్రకటించిన స్టార్ సింగర్ సునీత

By: Sankar Thu, 31 Dec 2020 10:50 AM

పెళ్లి తేదీ ప్రకటించిన స్టార్ సింగర్ సునీత


సింగర్ సునీత, ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో వివాహ నిశ్చితార్థం ఈ మధ్యే జరిగిన విషయం తెలిసిందే. అయితే అప్పటినుండి ఆమె పెళ్ళి పై ఒక్కొక్కరూ ఒక్కో విధమైన తేదీలను ప్రచారం చేస్తున్నారు. ఇంతకముందే జనవరి 9న సునీత, రామ్‌ వీరపనేని వివాహం జరగనున్నట్లు వార్తలు వచ్చాయి.

తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సునీత ఆ వార్తలను నిజం చేస్తూ... ''వచ్చే నెల 9వ తేదీన నా వివాహాం జరగనున్నది'' అని తెలిపింది.ఆ అలాగే కొత్త జీవితం బాగుండాలని శ్రీవారిని ప్రార్ధించా... కరోనా కారణంగా గత తొమ్మిది నెలలుగా శ్రీవారి దర్శనానికి దూరమయ్యా...

ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం ఆనందంగా వుంది అని సునీత తెలిపింది. అయితే అయితే..కరోనా నేపథ్యంలో వీరి పెళ్లికి కొందరు ప్రముఖులను మాత్రమే ఆహ్మానించనున్నారని సమాచారం.

Tags :
|

Advertisement