సెప్టెంబర్ 30 త్రిష ఫేవరేట్ డే
By: chandrasekar Thu, 01 Oct 2020 5:01 PM
తెలుగు, తమిళంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది స్టార్
హీరోయిన్ త్రిష. గత రెండు దశాబ్ధాల పాటు తమిళ, తెలుగు
సినీ పరిశ్రమల్లో బిజీగా ఉన్న హీరోయిన్స్‌లో త్రిష కూడా ఒకరు. తన జీవితంలో
సెప్టెంబర్ 30 అనేది ఒక మరచిపోలేని రోజు అని త్రిష తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
1999లో సెప్టెంబర్ 30న త్రిష కేవలం 16 ఏళ్ళ వయసులో ''మిస్ మద్రాస్ 1999' కిరీటాన్ని గెలుచుకున్నప్పటి ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో
షేర్ చేసి, “నా
జీవితాన్ని మార్చిన రోజు” అని ఆ రోజు ప్రాముఖ్యతను తేలిపింది.
'మిస్ చెన్నై' అయిన తరువాత వరుస సినిమా అవకాశాలతో బిజీ అయిపోయింది
త్రిష. 1999లో ప్రశాంత్, సిమ్రాన్
జంటగా కలిసి నటించిన జోడి చిత్రంలో ఒక చిన్న పాత్రతో వెండితెరపైకి ప్రవేశించి
త్రిష. ఆ తర్వాత సూర్యతో కలిసి 2002లో విడుదలైన 'మౌనం పెసియధే' చిత్రంతో
తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2003లో 'నీ
మనసు నాకు తెలుసు' సినిమాతో టాలివుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2004లో
'వర్షం' సినిమాలో
ప్రభాస్‌తో కలిసి నటించి తెలుగునాట భారీ ఫాన్స్ ని సొంతం చేసుకుంది. అప్పటి నుండి త్రిష, తన రెండు దశాబ్దాల కెరీర్‌లో వెనక్కి తిరిగి చూడనంతగా
బిజీ అయింది. ఈ ఏడాది త్రిష 6 సినిమాలకు సైన్ చేయగా అందులో ఇప్పటికే రెండు
సినిమాలు పూర్తి కాగా మరో నాలుగు సినిమాలు చేతిలో ఉన్నాయి.