బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ లోనే హోస్ట్‌గా కాన్ఫిడెన్స్ చూపిన సమంత
By: chandrasekar Mon, 26 Oct 2020 1:17 PM
బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్
లోనే హోస్ట్‌గా సమంత మంచి కాన్ఫిడెన్స్ చూపి ప్రేక్షకుల మధ్య మంచి మార్కులు
కొట్టేశారు. సమంత అక్కినేని ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెళ్లి
తర్వాత కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తుంది. అంతేకాదు అభిమానుల కోసం
వంటలతో పాటు మొక్కల పెంపకంలో తనదైన సలహాలు ఇస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా
మామ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తోన్న బిగ్‌బాస్ హౌస్ బాధ్యతలు చేపట్టి మామకు
తగ్గ కోడలు అనిపించకుంది. ఈ వీకెండ్ ఆదివారంతో పాటు దసరా కూడా కావడం సమంత స్పెషల్
అట్రాక్షన్స్‌గా నిలిచింది. తన యాంకరింగ్‌తో ఎక్కడ బోర్ కొట్టించకుండా అటు హౌస్‌మేట్స్‌తో
పాటు ఆడియన్స్ నుంచి మంచి మార్కులే కొట్టేసింది అక్కినేని కోడలు. ఎప్పటిలాగే గంట
గంటన్నర కాకుండా ఏక బిగినా నాలుగు గంటలు ప్రసారం చేసారు. గతంలో ఫైనల్ ఎపిసోడ్
మాత్రమే ఇంత పెద్దగా ఉండేది. కానీ సమంత ఫస్ట్ టైమ్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్
కోసమే ఏకంగా 4 గంటలు ప్రసారం చేసారు. మొత్తంగా చీరకట్టులో
అక్కినేని కోడలు హోస్ట్‌గా బాగానే మెస్మరైజ్ చేసింది. అంతేకాదు మొఖంపై చిరునవ్వు, హోస్ట్‌గా
సమంత కాన్ఫిడెన్స్ చూసి ఆమెకు హోస్ట్‌గా మొదటి ఎపిసోడ్ అంటే ఎవరు నమ్మరు. అంతలా
ప్రేక్షకులను మాయ చేసేసింది.
నటనలో మాత్రమే కాకుండా
యాంకరింగ్ లోను తన సత్తా చాటారు. ఈ షోలో సమంతకు అఖిల్ అక్కినేని, పాయల్
రాజ్‌పుత్, హైపర్ ఆది, కార్తికేయ లాంటి సెలబ్రిటీస్ కూడా సపోర్ట్ చేయడం
విశేషం. చాలా మంది ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా సమంత యాంకరింగ్‌ను ఆకాశానికి
ఎత్తేస్తే ఏదో కొద్ది మంది మాత్రమే మరి అంత సీన్ అంటూ కొట్టిపారేసారు. మొత్తంగా
బిగ్‌బాస్ హోస్ట్‌గా సమంత 100కు దాదాపు 70 మార్కులు పడ్డాయని చెబుతున్నారు. ఇక బిగ్‌బాస్ షో
అంటే గుర్తుకు వచ్చేది నాగార్జున. గత సీజన్‌తో పాటు ఈ సీజన్‌కు ఆయనే హోస్ట్‌గా
వ్యవహరిస్తున్నారు. ఐతే ’వైల్డ్ డాగ్’ షూటింగ్ నిమిత్తం నాగార్జున ఇపుడు హిమాచల్
ప్రదేశ్‌లో రోహ్‌తంగ్ పాస్‌లో షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అక్కడే కంటిన్యూగా 21
రోజులు షూటింగ్ తర్వాత నాగార్జున మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తాడు.
అప్పటి వరకు మామ నాగార్జున అప్పగించిన బాధ్యతలను సమంత చూసుకుంటుంది. అంతేకాదు బిగ్‌బాస్
హోస్ట్‌గా సమంతకు ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ. 40లక్షల తీసుకుంటున్నట్టు
స్టార్ మా వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా 5 వారాలకు రూ. 2.10 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. ఏ రకంగా
చూసినా సమంత బిగ్ స్క్రీన్ పైనే కాదు స్మాల్ స్క్రీన్ పై తన యాంకరింగ్‌తో మాయ
చేసిందనే చెప్పాలి. ప్రజలమధ్య అనూహ్య స్పందనను పొందారు.