'థాంక్యూ' లో నాగచైతన్య జోడీగా సమంత
By: chandrasekar Fri, 03 July 2020 1:21 PM
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు
విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో రూపుదిద్దుకొంటున్న కొత్త సినిమాలో అక్కినేని
నాగచైతన్య హీరోగా నటించనున్నారు. ఈ
సినిమాకు 'థాంక్యూ' అనే
టైటిల్ ను ఖరారు చేసినట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రంలో హీరోయిన్ గా
కీర్తి సురేష్ ను తీసుకోవాలని నిర్ణయించినప్పటికీ ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో
బిజీగా ఉంది. ప్రస్తుతం కీర్తి సురేష్ నటించబోతున్న చిత్రాలు ’మిస్ ఇండియా, ’రంగ్
దే‘, ’ సర్కారు
వారి పాట‘తో పాటు మరో సినిమా ఉంది. ఈ నేపథ్యంలో కీర్తి `థాంక్యూ`సినిమాలో
నటించే పరిస్థితి కనబడటం లేదు.
కాని వరుస సినిమాలతో
బిజీగా ఉన్న కీర్తి తేదీలను సర్దుబాటు చేయలేకపోతుందని, ఈ
సినిమాలో కీర్తి నటించని పక్షంలో ప్రముఖ హీరోయిన్ సమంతను తీసుకోవాలని విక్రమ్
కుమార్ భావిస్తున్నారని సమాచారం.
ఇదివరకే డైరెక్టర్
విక్రమ్ కుమార్ రూపొందించిన ’మనం‘,
24 సినిమాల్లో సమంత నటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్
పూర్తిస్థాయిలో ఎత్తివేసిన తరువాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని టాలీవుడ్
వర్గాల టాక్.