- హోమ్›
- వినోదం›
- ఐఎండిబి చరిత్రలో చెత్త సినిమా ఇదే ..సుశాంత్ మరణం ఎఫెక్ట్ ఆ సినిమా మీద గట్టిగా పని చేసింది
ఐఎండిబి చరిత్రలో చెత్త సినిమా ఇదే ..సుశాంత్ మరణం ఎఫెక్ట్ ఆ సినిమా మీద గట్టిగా పని చేసింది
By: Sankar Sun, 30 Aug 2020 4:53 PM
బాలీవుడ్ సుశాంత్ సింగ్ మరణం బాగానే ప్రభావం చూపింది..ఎంతలా అంటే స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ , ఆయన కూతురు హీరోయిన్ అలియా భట్ కలయికలో వచ్చిన లేటెస్ట్ మూవీ సడక్ 2 కి అత్యంత చెత్త రేటింగ్ ఇచ్చేంత..ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ప్రపంచంలోనే అత్యధిక డిస్‌లైకులు తెచ్చుకున్న రెండో యూట్యూబ్ వీడియోగా రికార్డుకెక్కిన విషయం తెలిసిందే.
చూస్తుంటే ఇప్పుడు సినిమా కూడా రికార్డులు కొట్టేటట్లు కనిపిస్తోంది. ఆగస్టు 28న ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం పరమ చెత్తగా ఉందంటూ 35 వేలకు పైగా ప్రేక్షకులు ఐఎండీబీలో 1 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇంకా ఎంతోమంది ఇదే రేటింగ్ ఇస్తూనే ఉన్నారు. దీంతో ఐఎండీబీలో అత్యంత హీనమైన రేటింగ్ దక్కించుకున్న చిత్రంగా సడక్ మొదటి స్థానంలో నిలిచింది. 1.3 స్టార్ రేటింగ్‌తో టర్కీ సినిమా రెండో స్థానంలో ఉంది.
నెపోటిజమ్ మహారాణి అంటూ అలియా భట్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె నటించిన 'సడక్ 2' ట్రైలర్ విడుదల అవగా దానికి డిస్‌లైక్‌లు కొడుతూ ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. తాజాగా సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదలవడంతో మరోసారి రేటింగ్స్‌తో తమ ప్రతాపాన్ని చూపించారు. 'సినిమా దరిద్రంగా ఉంది', 'ఒక్క స్టార్ ఇవ్వడమే ఎక్కువ', 'నటన అస్సలు బాగోలేదు', 'ఫస్టాఫే బోర్ కొట్టేసింది' అంటూ నెటిజన్లు ఒకటికి మించి రేటింగ్ ఇవ్వడం లేదు