మహేష్ సినిమాలో నటించడం లేదు ..రేణు దేశాయి
By: Sankar Mon, 29 June 2020 6:29 PM
తెలుగులో ఒకప్పుడు బద్రి , జానీ వంటి సినిమాలతో అభిమానుల్లో మంచి పేరు సంపాదించినా నటి రేణు దేశాయి ..ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకొని నటనకు దూరం అయింది ..అయితే ఇటీవలి కాలంలో మళ్ళీ టీవీ షో లలో కనిపిస్తుండటంతో రేణు దేశాయి తిరిగి సినిమాలు చేస్తది అని అభిమానులు భావించారు ..అయితే అవి ఏవి నిజం కాదని రేణు దేశాయి కొట్టిపారేశారు ..
తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో అడవి శేష్ హీరోగా `మేజర్` సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటి రేణూదేశాయ్ కనిపించనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఓ ఛానెల్‌తో మాట్లాడిన రేణు ఆ సినిమా గురించి స్పందించారు.
అది పూర్తిగా అవాస్తవం. నేను ప్రస్తుతం ఏ సినిమానూ అంగీకరించలేదు. రెండు మూడు రోజుల నుంచి చాలా మంది కాల్ చేసి ఆ సినిమా గురించి అడుగుతున్నారు. ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఏదైనా సినిమా ఒప్పుకుంటే నేనే ప్రకటన చేస్తాను. నాకూ సినిమాల్లో నటించాలనే ఉందని రేణు చెప్పారు.