Advertisement

  • నిర్మాత అవతారం ఎత్తనున్న రియల్ హీరో సోను సూద్

నిర్మాత అవతారం ఎత్తనున్న రియల్ హీరో సోను సూద్

By: Sankar Wed, 30 Dec 2020 4:35 PM

నిర్మాత అవతారం ఎత్తనున్న రియల్ హీరో  సోను సూద్


ఇప్పటివరకు యాక్ట‌ర్ గా అల‌రించిన సోనూసూద్ నిర్మాణ‌రంగంలోకి అడుగుపెడుతున్నాడు. త‌న తండ్రి శ‌క్తి సాగ‌ర్ సూద్ పేరు మీద నెల‌కొల్పిన శ‌క్తిసాగ‌ర్ ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్ లో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.స్పూర్తిని క‌లిగించే క‌థ‌ల‌తో సొంత బ్యాన‌ర్ లో సినిమాలు తీసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు చెప్పాడు. అంతేకాదు తాను తీయ‌బోయే క‌థ‌ల్లో లీడ్ చేస్తే బాగుంటుంద‌ని అనుకుంటున్నాడ‌ట‌. ప‌లువురు డైరెక్ట‌ర్లు సోనూసూద్ తో క‌లిసి పనిచేసేందుకు రెడీగా ఉన్న‌ట్టు టాక్‌..

కాగా లాక్ డౌన్ లో విప‌త్క‌ర‌ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న ల‌క్ష‌లాది మందికి అండ‌గా నిలిచి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు బాలీవుడ్ న‌టుడు సోనూసూద్‌. సోనూసూద్ కు వ‌చ్చిన ఇమేజ్ దృష్ట్యా పాజిటివ్‌ షేడ్స్ ఉన్న పాత్ర‌ల‌ను డిజైన్ చేస్తున్నారు ద‌ర్శ‌కులు. సోనూసూద్‌కు హీరో పాత్ర‌లు చేయాలంటూ ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి..

ఇక ప్రస్తుతం సోను తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న‌టిస్తోన్న అల్లుడు అదుర్స్ లో కీ రోల్ చేస్తున్నాడు సోనూసూద్‌. క‌మ‌ర్షియ‌ల్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌స్తున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 15న విడుద‌ల కానుంది.ఇక మెగాస్టార్ ఆచార్య సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు...

Tags :

Advertisement