ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో పూజా హెగ్డేతో రొమాంటిక్ పోజిస్తూ కనిపించిన ప్రభాస్
By: chandrasekar Sat, 11 July 2020 2:21 PM
ఎంతగానో ఎదురుచూసిన యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఆ క్షణం వచ్చేసింది. ప్రభాస్ 20వ సినిమా
టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో
హీరోయిన్ పూజా హెగ్డేతో రొమాంటిక్ పోజిస్తూ కనిపించి తన అభిమానులకు స్పెషల్
కిక్కిచ్చారు ప్రభాస్.
విడుదలైన కొన్ని
నిమిషాల్లోనే వైరల్ అయిన ఈ పోస్టర్ చూసి రెబల్ స్టార్ మురిసిపోతున్నారు. ముందుగా
అనుకున్నట్లుగానే ఈ సినిమాకు ''రాధే శ్యామ్'' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు దర్శకనిర్మాతలు. 'జిల్' ఫేమ్
రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను గోపీకృష్ణ బ్యానర్, యూవీ
క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ప్రభాస్ సరసన అందాల భామ
పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ
సినిమాను కూడా ప్రభాస్ మార్కెట్ దృష్ట్యా ప్యాన్ ఇండియా మూవీ గానే ప్రేక్షకుల
ముందుకు తీసుకురాబోతున్నారు. 1960 దశకం నాటి ప్రేమకథతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
ఇందులో ప్రభాస్ ప్రభాస్
ప్యూర్ రొమాంటిక్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్
హీరోయిన్ భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా కనిపించనుంది. సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, మురళీ
శర్మ, సాషా
ఛేత్రి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.