ఎన్టీఆర్ కు సినిమాల్లో ఇంకా చాల భవిష్యత్తు ఉంది ..బాలకృష్ణ
By: Sankar Tue, 02 June 2020 1:49 PM
తెలుగు సినిమా చరిత్రలో నెంబర్ వన్ హీరో అంటే చాల మంది చెప్పే సమాధానం నట రత్న నందమూరి తారక రామారావు గారి పేరు ..తన అసమానమైన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్ ..అదే అభిమాన ఘనంతో తెలుగు దేశం పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అయ్యాడు..ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబునాయుడు నడిపిస్తున్న టీడీపీ పార్టీ ఇటీవల కాలంలో కొంచెం ఒడిదుడుకులకు లోను అవుతుంది..
అయితే తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర నటులలో ఒకడిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ పార్టీ లోకి వస్తే , పార్టీ మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అని కార్యకర్తలు భావిస్తున్నారు..ఇదే విషయాన్నీ ఎన్టీఆర్ తనయుడు , యువరత్న బాలకృష్ణను అడగగా అది డేడికేషన్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. అదీగాక మీరు ఫుల్ టైమ్ పొలిటిక్స్ అంటున్నారు. తనకు సినిమా యాక్టర్‌గా చాలా భవిష్యత్తు ఉంది. మరి వాడిష్టం. ప్రొఫెషన్ వదులుకుని రమ్మనముగా. ఇప్పుడు నేనున్నాను ఎం.ఎల్.ఎగా ఉన్నాను, సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్నాను. నాన్నగారు కూడా సీఎంగా ఉన్నప్పుడు సినిమాల్లో యాక్ట్ చేశారు. కాబట్టి వారి వారి ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది’’ అన్నారు.
అయితే తెలుగుదేశం పార్టీ కోసం 2009లో ప్రచారాన్ని నిర్వహించారు తారక్. తర్వాత రాజకీయాలకు దూరంగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ తో కలిసి ఆర్ ఆర్ ఆర్ మూవీ లో ఎన్టీఆర్ నటిస్తున్నారు ..