కరోనా వలన కుటుంబంతో గడిపే అవకాశం దొరికింది ..నిత్య మీనన్
By: Sankar Mon, 22 June 2020 5:26 PM
నిత్య మీనన్ ..అద్భుత ప్రతిభ కలిగి ఉన్న నటి ..కేవలం పాటలకే పరిమితం అయ్యే పాత్రలకే కాకుండా , తన పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటేనే తాను ఆ పాత్రను పోషిస్తుంది ..తన సహజ నటనతో నాని , నితిన్ వంటి యంగ్ హీరోల హిట్ సినిమాలో నటించింది ..అయితే ఇటీవల కాలంలో నిత్య మీనన్ తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు ..ప్రస్తుతం నిత్య చేతిలో నాలుగైదు ప్రాజెక్టులుండగా అటు వెబ్ సిరీస్‌కూ పచ్చజెండా ఊపేసింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్న "బ్రీత్: ఇన్ టు ది షాడోస్" చిత్రంతో వెబ్ సిరీస్‌లో తెరంగ్రేటం చేయనుంది. ఇందులో అభిషేక్ బచ్చన్, అమిత్ సాధ్, సైయామీ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆమె చివరిసారిగా 'సైకో' చిత్రంలో కనిపించింది.
అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని షూటింగ్స్ వాయిదా పది దాదాపు మూడు నెలలు అవుతుంది ..ఇప్పుడిప్పుడే షూటింగ్లకు పర్మిషన్ ఇస్తుండటంతో మల్లి నిర్మాతలు తిరిగి షూటింగ్స్ ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు ..అయితే తాను మాత్రం అప్పుడే సినిమా షూటింగ్ లలో పాల్గొనను అని ఈ మలయాళ భామ తెలిపింది ..
సెట్స్‌లో భౌతికదూరం పాటించడం దాదాపు అసాధ్యమని, ప్రస్తుత కోవిడ్ పరిస్థితిని పరిశీలించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేసింది. అయినా దీనికంత తొందరేం లేదని తెలిపింది. మరోవైపు ఈ లాక్‌డౌన్ కాలాన్ని విపరీతంగా వాడేసుకున్నానంటోంది. బెంగళూరులో కుటుంబంతో కలిసి నివసించేందుకు అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేసింది.ఈ సమయంలో రాయడం, చదవడం మళ్లీ మొదలెట్టానని, పనిలో పనిగా ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టినట్లు తెలిపింది. ముఖ్యంగా వీధులన్నీ నిర్మానుష్యంగా, నిశ్శబ్ధంగా ఉండటం ఎంతో ప్రశాంతతనిచ్చిందని పేర్కొంది. కాగా నిత్య చేతిలో నాలుగైదు ప్రాజెక్టులుండగా అటు వెబ్ సిరీస్‌కూ పచ్చజెండా ఊపేసింది.