మెయిల్ టీజర్ విడుదల...!
By: Anji Thu, 31 Dec 2020 2:31 PM
స్వప్నదత్, ప్రియాంకదత్ నిర్మాతలుగా ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మెయిల్’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదల కానుంది.
ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. అందులో ‘కంప్యూటర్ నేర్చుకోవాలంటే నేను చెప్పే మూడు షరతులను కచ్చితంగా పాటించాలి.. మొదటిది స్నానం చేసి రావాలి..
రెండవది చెప్పులు బయటనే విడిచి పెట్టాలి.. మూడవది నేను చెప్పిన సమయానికి రావాలి.. అంతేకాకుండా అంజి, రమేశ్ లాగా మరొక దుకాణం ప్రారంభిస్తా అంటే మంచిగా ఉండదు’ అనే మాటలు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి.
Tags :
movie |
teaser |