తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పిన మహేష్ బాబు
By: Sankar Sun, 21 June 2020 7:35 PM
సూపర్ స్టార్ మహేష్ బాబుకు తన తండ్రి కృష్ణ అంటే ఎంత ఇష్టమో ఎన్నో సందర్భాలలో చెప్పాడు ..కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు అంచెలంచలుగా ఎదుగుతూ సూపర్ స్టార్ స్థాయిని అందుకున్నాడు..అయితే ఫాథర్స్ డే సందర్భంగా ట్విట్టర్లో తన తండ్రి గురించి రాసుకొచ్చాడు మహేష్ బాబు ..
నా తండ్రి గురించి చెప్పమంటే.. ప్రేమ, దయ, కరుణ, బలం, ఇతరులపై చూపే జాలి ఈ పదాలే నాకు గుర్తుకొస్తాయి. ఈ రోజు నాలో ఉన్న లక్షణాలన్నీ ఆయన నుండి వచ్చినవే. ఆ లక్షణాలతోనే ప్రయాణిస్తున్నాను. ఆయన నాతో ఎలా ఉండేవారో నేను నా పిల్లలతో అలా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. హ్యపీ ఫాదర్స్ డే నాన్నా!. నా దారిలో ఎప్పుడూ మీరే ముందుంటారు'' అని పేర్కొన్నారు మహేష్ బాబు. ఈ మేరకు తండ్రితో దిగిన చిన్ననాటి పిక్ షేర్ చేశారు. ఈ ట్వీట్ చూసిన సూపర్ స్టార్ అభిమానులు ఖుషీ అవుతూ 'హ్యాపీ ఫాదర్స్ డే' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఫాదర్స్ డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు తమ తమ తండ్రితో అనుబంధాన్ని, ఆప్యాయతను గుర్తుచేసుకుంటూ ట్వీట్స్ పెడుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ తమ తమ తండ్రులతో అనుబంధం తాలూకు విషయాలు తెలుపుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.రామ్ చరణ్ ను చిరంజీవి వాళ్ళ నాన్న గారు ఎత్తుకున్న ఫోటోను చిరంజీవి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు