కొద్ది మందితో సినిమా షూటింగ్స్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి
By: chandrasekar Tue, 02 June 2020 4:37 PM
కరోనా మహమ్మారిని కట్టడి
చేసే చర్యల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి
తెలిసిందే. దీంతో అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. అయితే తాజాగా లాక్ డౌన్ 5.0లో
కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. కొన్ని షరతులతో దాదాపు అన్ని పరిశ్రమల్నీ
ఓపెన్ చేసుకోవచ్చని ప్రకటించింది. జూన్ 8నుండి షాపింగ్ మాల్స్‌కు అనుమతిని ఇచ్చిన సినిమా
హాల్స్‌కు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కొన్ని అధికారాలతో రాష్ట్ర
ప్రభుత్వాలు కొద్ది మందితో షూటింగ్‌లకు అనుమతిని ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇటీవల టాలీవుడ్ ప్రముఖులు
తెలంగాణ ముఖ్య మంత్రిని కలిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబందించిన గైడ్
లైన్స్‌ను రూపోందించే పనిలో ఉన్నారు అధికారులు. మరోవైపు మహారాష్ట్రలో సినిమాలు, టెలీ
సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, వాణిజ్య ప్రకటనల సంబందించిన షూటింగ్స్ జరుపుకోవచ్చని
అక్కడి సర్కారు పేర్కోంది.
షూటింగ్ జరుపుకునే
విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలనీ పేర్కోంది. ఈ నిబంధనల ప్రకారం నిర్మాతలు ప్రీ
ప్రొడక్షన్, పోస్ట్ ప్రోడక్షన్ పనులను నిబంధనల ప్రకారం
చేసుకోవచ్చు. షూటింగ్స్ జరుపుకోవాలంటే ఆయా జిల్లాకు చెందిన కలెక్టర్లకు దరఖాస్తు
చేసుకోవాలని సినిమా సెట్స్, ఎడిటింగ్ స్టూడియోల్లో ఎక్కువ మంది ఉండకుండా
చూడటంతోపాటు భౌతిక దూరం పాటించాలని కండీషన్ పెట్టింది.
మరోవైపు లాక్‌డౌన్‌తో
మూతబడిన తమిళనాడు టీవీ పరిశ్రమ మళ్లీ తెరుచుకోబోతున్నట్లు సమాచారం. అక్కడి
ప్రభుత్వంల టీవీ సీరియళ్ల షూటింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షూటింగ్‌లో
గరిష్టంగా 20 మందితో షూటింగ్ జరుపుకోవచ్చని ప్రభుత్వం అనుమతి
ఇవ్వగా, అంత
కొద్దిమందితో షూటింగ్ సాధ్యం కాదని, కనీసం 60 మందితో కూడిన షూటింగులకు అనుమతి ఇవ్వాలని ఫెఫ్సీ
అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, టీవీ నిర్మాతల మండలి అధ్యక్షురాలు సుజాత విజయ్‌కుమార్, కార్యదర్శి
కుష్బూ తదితరులు తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. అయితే వారి విజ్ఞప్తిని
పరిశీలించిన ప్రభుత్వం శనివారం షూటింగ్ జరుపుకోవచ్చంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కానీ చిన్న కండీషన్ పెట్టింది. షూటింగ్ నిర్వహించే ప్రదేశాల్లో జిల్లాల అధికారుల
అనుమతి తీసుకోవాలనీ ప్రభుత్వం పేర్కొంది.