సంక్రాంతి బరిలో దళపతి విజయ్ మాస్టర్ సినిమా
By: Sankar Tue, 29 Dec 2020 6:59 PM
లాక్‌డౌన్ అనంతరం సినిమా థియేటర్లు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. మొన్నటి వరకు సినిమాలు ఓటీటీలో విడుదలయ్యినప్పటికీ ఇప్పుడు మాత్రం మళ్లీ థియేటర్లలోనే హడావిడి చేసేందుకు దర్శకనిర్మాతలు ముందడుగు వేస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే మర్డర్, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాలు థియేటర్లలో విడుదల అయ్యాయి. మరోవైపు థియేటర్లలో విడుదలైన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో మిగిలిన వారు కూడా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో తలపతి విజయ్ నటిస్తోన్న యాక్షన్ మూవీ మాస్టర్ సంక్రాంతి బరిలో దిగనుంది.
2021 జనవరి 13న సంక్రాంతి కానుకగా మాస్టర్ థియేటర్లలలో సందడి చేయనుందని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు దర్శకుడు మంగళవారం ఓ పోస్టర్‌ను విడుదల చేశాడు. తమిళంతో పాటు తెలుగు భాషల్లో కూడా మాస్టర్ ఒకేసారి విడుదల అవుతుంది. హిందీలో మాత్రం ఒక రోజు ఆలస్యంగా జనవరి 14న రిలీజ్ అవ్వనుంది..