కత్రినా కైఫ్ సౌందర్య రహస్యాలు
By: chandrasekar Tue, 04 Aug 2020 1:20 PM
కత్రినా కైఫ్ మేకప్ ఉన్నా
లేకున్నా అందంగా కనిపించే బాలీవుడ్ తారలలో ఒకరు. కత్రినా ఫాలో అయ్యే బ్యూటీ
సీక్రెట్స్ చాలా ఈజీ. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవడం, అధిక కొవ్వుని
తగ్గించుకోవడానికి జిమ్ కి వెళ్లడం, సింపుల్ స్కిన్ కేర్ టిప్స్ ను పాటించడం. ఇవి కత్రినా
కైఫ్ సౌందర్య రహస్యాలు. కత్రినా కైఫ్ ఫాలో అయ్యే బ్యూటీ, ఫిట్నెస్
సీక్రెట్స్‌లో కొన్నిటి గురించి కూడా తెలుసుకోండి. కత్రినా కైఫ్ మంచి నీరు
ఎక్కువగా తాగుతుంది. ఉదయం లేవగానే, కనీసం 4 గ్లాసుల మంచి నీరు తాగుతుంది. ప్రకాశవంతమైన చర్మం
పొందడం కోసం, నేరేడు పండు, వీట్ గ్రాస్ పొడి నుంచి వచ్చిన ఆహార సప్లిమెంట్లను
తీసుకుంటుంది. మాక్రోబయోటిక్ డైట్ ని ఈ 'మల్లేశ్వరి' నటి ఫాలో అవుతుంది. తాజాగా ఉడికించిన కూరగాయలను, పండ్లను
ప్రతీ రెండు గంటలకొకసారి తింటుంది. పిండిపదార్ధాలకు దూరంగా ఉండే కత్రినా కైఫ్ పీచు
ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకుంటుంది.
అల్పాహారంలో కత్రినా
తృణధాన్యాలు, ఓట్ మీల్ తీసుకుంటుంది. వేయించిన చేప, వెన్నతో
కూడిన బ్రౌన్ బ్రెడ్ కత్రినా మధ్యాహ్నపు భోజనంలో తప్పనిసరిగా ఉండాలి. సాయంత్రం పూట, వేరుశెనగ
వెన్నతో బ్రౌన్ బ్రెడ్ ను తింటుంది. రాత్రి భోజనానికి, సూప్, చేప, చపాతీ, వేయించిన
కూరగాయలు తీసుకుంటుంది. కత్రినా క్రమం తప్పకుండా యోగా చేస్తుంది. ఇదే ఈ హీరోయిన్
అద్భుతమైన శరీరాకృతిని దక్కించుకోవడంలో సహాయపడుతుంది.
ఈ స్టార్ హీరోయిన్ కు
సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా శిక్షణ ఇస్తోంది. జిమ్ కి వెళ్లడం, జాగింగ్
చేయడం, ఐసో ప్లాంక్స్
చేయడం, ఈదడం
వంటి వ్యాయామాలను కూడా చేస్తుంది క్యాట్. నిద్రపోయేముందు, ఈ
సుందరి తన ముఖాన్ని శుభ్రం చేసుకుంటుంది. తన ముఖాన్ని శుభ్రం చేయడానికి, మేకప్
తొలగించడానికి షూ వేమురా స్కిన్ క్లీన్సింగ్ బ్యూటీ ఆయిల్ ని ఉపయోగిస్తుంది.
పగటిపూటకు మెనీ అండ్ మోయ్
ఫేస్ వాష్ ని ఉపయోగించే కత్రినా ముఖానికి, కళ్ళకు లంకోమ్ క్లీన్సింగ్ మిల్క్ ని వాడుతుంది. తన
స్కిన్‌కి, అన్నే సెమోనిన్ వారి మినరల్ మడ్ మాస్క్ వాడుతుంది.
సప్నా భావనని, అసిఫ్ రంజన్ లు కత్రినాకు నచ్చే హెయిర్
డ్రెస్సేర్లు. ప్రకాశవంతమైన జుట్టు కోసం
కిఎహ్ల్స్ లీవ్-ఇన్ కండీషనర్ ను వాడుతుంది. జుట్టు బాగా ఉండడానికి కత్రినా
కిఎహ్ల్స్ ఆలివ్ ఫ్రూట్ ఆయిల్ డీప్లీ రెస్పిరేషన్ హెయిర్ ప్యాక్ ను వాడుతుంది.
వేడి పరికరాలను జుట్టుపై
పెట్టేముందు, జుట్టును సంరక్షించే హీట్ ప్రొటెక్టన్ట్లను, హెయిర్
సీరమ్‌ని వాడుతుంది. పార్టీలకు వెళ్లేముందు, కెరాస్టేస్ ఉత్పత్తులను ఉపయోగించి జుట్టును
ఆరబెడుతుంది. క్యాట్ తన కురుల కోసం పాడిల్ బ్రష్ ని ఉపయోగిస్తుంది. కత్రినా కైఫ్
కు పెద్దగా మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే, షూటింగ్ లేనప్పుడు, ఆమె
అరుదుగా మేకప్ వేసుకుంటుంది. ఎక్కువగా సహజంగానే ఉండడానికి ఇష్టపడుతుంది. మేకప్
పెట్టేముందు, ఒక పలచని వస్త్రంలో చిన్న ఐసు ముక్కని పెట్టి ముఖం
మొత్తానికి అప్లై చేస్తుంది.
అన్నే సెమోనిన్ వారి
ఆప్రికాట్ నూనెని కూడా కత్రినా ఉపయోగిస్తుంది. పగటిపూట, ముఖంపై, అలాగే
బయటకు కనిపించే శరీరంపై, మాయిశ్చరైజింగ్ సన్ లాక్ పెట్టకుండా ఇంటి నుంచి బయటకు
వెళ్ళదు. పగటిపూట మేకప్ వేసుకోవడానికి కత్రినా కేవలం నాలుగు ఉత్పత్తులను మాత్రమే
వాడుతుంది. ఆమె పీటర్ థామస్ రోత్ మాక్స్ డైలీ డిఫెన్స్ మాయిశ్చర్ క్రీమ్ ఎస్పీఎఫ్ 30ను
అప్లై చేస్తుంది. పెదాలపై, నేరేడు పండు రంగులో ఉండే స్టిలా లిప్ గ్లేజ్ ను
వాడుతుంది. కత్రినాకు జార్జియో అర్మానీ షీర్ బ్లష్, మాక్స్ ఫాక్టర్ 2000 కెలరీ
కర్వ్డ్ బ్రష్ మస్కారాను వాడడం అంటే ఎంతో ఇష్టం. మిగిలిన ముఖ భాగాలపై పెట్టే
శ్రద్ధ కంటే కనులపై ఎక్కువ శ్రద్ధ పెట్టడమే కత్రినా పాటించే ఆమె రహస్యం. ఆమె వైవ్స్
సెయింట్ లారెంట్ మాస్కరాను మరియు కళ్ళ కోసం మాక్ కోహ్ల్ ను ఉపయోగిస్తుంది.
ఫౌండేషన్ ను ఉపయోగించదు. ముఖ్యంగా మేకప్ ఫరెవర్ కామోఫ్లాజ్ క్రీమ్ పాలెట్ నెం 3కు
ప్రాధ్యానత ఇస్తుంది. వైవ్స్ సెయింట్ లారెంట్ టచ్ ఎక్లాట్ అంటే కత్రినాకు ఎంతో
ఇష్టం.