- హోమ్›
- వినోదం›
- యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు , కన్నడ యువ హీరో ధ్రువ సర్జా దంపతులకు కరోనా పాజిటివ్ ..
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు , కన్నడ యువ హీరో ధ్రువ సర్జా దంపతులకు కరోనా పాజిటివ్ ..
By: Sankar Thu, 16 July 2020 9:29 PM
కన్నడ యువ నటుడు ధృవ సార్జా, ఆయన భార్య ప్రేరణకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. స్వల్ప లక్షణాలతో కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ధృవ సార్జా స్వయంగా ఖరారు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘కొవిడ్ 19 పరీక్షలో నాకు, నా భార్యకు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి. కరోనా పాజిటివ్ అని తేలగానే మేమిద్దరం హాస్పిటల్‌లో చేరాం. త్వరలోనే ఆరోగ్యంగా బయటికి వస్తామని నాకు నమ్మకం ఉంది’’ అని ధృవ ట్వీట్‌లో పేర్కొన్నారు..
ఇప్పటికే ధ్రువ సార్జా అన్నయ్య చిరంజీవి సార్జా ఇటీవల మరణించిన విషయం తెలిసిందే ..ఆ బాధ నుంచి తేరుకునేలోపే ఇప్పుడు ఇలా కరోనా పాజిటివ్ బారిన పడటంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు ..అయితే ఈ మధ్యకాలంలో తనతో సన్నిహితంగా ఉన్నవారంతా ఎవరికివారు కరోనా పరీక్ష చేయించుకోవాలని ధృవ సార్జా సూచించారు.
కాగా ధృవ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘పొగరు’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో రష్మికకు బోయ్‌ఫ్రెండ్‌గా రష్మిక కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా మార్చిలో విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదా పడింది