హైదరాబాద్ గురించి కంగనా కామెంట్స్...
By: chandrasekar Mon, 12 Oct 2020 6:02 PM
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
కేసులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ కంగనా రనౌత్ మహారాష్ట్ర సర్కారు
ఆగ్రహానికి గురైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆమె వై ప్లస్ కేటరిగీ భద్రత
కల్పించింది. ప్రస్తుతం కంగనా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి'లో
టైటిల్ పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో
అసెంబ్లీ సెట్ వేశారు. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోనే ఉంటున్న కంగనా షూటింగ్‌లో
పాల్గొంటోంది. రీసెంట్‌గా కంగనా అసెంబ్లీ మాట్లాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాను
షేక్ చేస్తున్నాయి.
షూటింగ్‌లో బిజీగా
ఉన్నప్పటికీ ఖాళీ సమయంలో ఆమె సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ సందర్భంగా
హైదరాబాద్ అందానికి ఫిదా అయిన ఈ బ్యూటీ తన ఫీలింగ్స్‌ని ట్విటర్ ద్వారా షేర్
చేసింది. ‘హైదరాబాద్ నగరం ఎంతో అందంగా ఉంది. అహ్లాదకరంగా హిమాలయాలను తలపిస్తోంది.
సూర్యోదయ సమయంలో ఈ అందం మరింత పెరుగుతోంది. చలి వేస్తూనే అప్పుడప్పుడు కలిగే
వెచ్చదనం ఓ రకమైన మత్తులోకి లాక్కెళ్తోంది’ అంటూ కంగనా తాను ఉంటున్న ప్లాట్ నుంచి
తీసిన 7సెకన్ల
వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.