మహేష్ అమ్మగా భాగ్య శ్రీ నటించబోతున్నట్టు ఇండస్ట్రీ టాక్
By: chandrasekar Tue, 14 July 2020 6:01 PM
భాగ్య శ్రీ కథానాయికగా
అలరించిన అద్భుత నటి. ప్రస్తుతం ఈమెకి
టాలీవుడ్ నుండి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ నటించిన
రాధేశ్యామ్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, తాజాగా మరో తెలుగు
సినిమా ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తుంది.
మహేష్ నటిస్తున్న సర్కారు
వారి పాట చిత్రంలో బాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ మహేష్‌కి తల్లిగా నటించబోతున్నట్టు
ఇండస్ట్రీ టాక్. దీనిపై క్లారిటీ రావలసి ఉంది. మహేష్, కీర్తి
సురేష్ ప్రధాన పాత్రలలో పరశురాం సర్కారు వారి పాట అనే చిత్రం చేస్తున్న విషయం
తెలిసిందే.
రొమాంటిక్ కామెడీ జానర్లో
రూపొందనున్న ఈ సినిమాలో కొన్ని సామాజిక అంశాలు కూడా కీలకం కానున్నాయట.
ఇక హీరో బ్యాంకు మేనేజర్
అంటూ సినిమా భారీ కుంభకోణం నేపథ్యంలో సాగుతుందని వార్తలు వస్తున్నాయి. మహేష్ 27వ
సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్, టైటిల్
విడుదల కాగా, వాటికి మంచి స్పందన లభించింది. ఇక మహేష్ హెయిర్
స్టైల్ టాటూ చూసే సరికి అభిమానులలో మరింత ఆసక్తి పెరిగింది.