సితారకి జన్మదిన శుభాకాంక్షలు
By: chandrasekar Tue, 21 July 2020 5:01 PM
మహేష్ కూతురు సితారకి ఈ
రోజు 8వ
పుట్టిన రోజు సందర్భంగా మహేష్ ఆయన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్ సితారకి
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఘట్టమనేని ఫ్యాన్స్ కూడా సితారకి బర్త్‌డే
విషెస్ తెలియజేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
అయితే సితార బర్త్‌డే
సందర్భంగా మహేష్ తన ట్విట్టర్‌లో కూతురితో గడిపిన ఆనందక్షణాలకి సంబంధించిన
ఫోటోస్‌ని వీడియో రూపంలోకి మార్చి షేర్ చేశాడు. సితారకి 8
ఏళ్ళు. ఎంత స్పీడ్‌గా ఎదుగుతుందో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను.
ఈ విషయం ఎప్పటికీ తెలియదు. జన్మదిన శుభాకాంక్షలు సితార అంటూ తన ట్వీట్‌లో
పేర్కొన్నారు.
మహేష్. చిన్నారి సితార
వెండితెర ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికీ, అంతకు మించిన ఆదరణ పొందింది. యూ ట్యూబ్ ఛానెల్
స్టార్ట్ చేసి అందులో అద్భుతమైన వీడియోలు షేర్ చేస్తూ జనాలకి పలు విషయాలపై
అవగాహన కల్పిస్తూ వస్తుంది.