ఫస్ట్ రోర్ టీజర్‌కు మంచి రెస్పాన్స్...బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్
By: chandrasekar Thu, 02 July 2020 4:42 PM
ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి
శ్రీను సినిమా ఒక షెడ్యూల్ కంప్లీటైన తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా
షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా కోసం ఈ చిత్రం కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా
చేయించుకున్నాడు. ఇక బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా BB3 అంటూ
విడుదల చేసిన ఫస్ట్ రోర్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మరోసారి బోయపాటి శ్రీను
తనదైన మార్క్‌తో బాలయ్యను స్క్రీన్ పై ప్రెజెంట్ చేయనున్నట్టు తెలుస్తోంది. తాజాగా
ఈ సినిమా విషయంలో ఓ సెంటిమెంట్‌ను బాలయ్య అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.
బాలకృష్ణ నటుడిగా మారిన తర్వాత 1983లో ఆయన హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా విడుదల
కాలేదు. 1984లో
బాలయ్య పూర్తిస్థాయి హీరోగా మారారు. అప్పటి నుంచి బాలకృష్ణ నటించిన సినిమాలు ప్రతి
కాలెండర్ ఇయర్‌లో విడుదలయ్యాయి. 2013లో మాత్రం ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఆ తర్వాత 2014లో
బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘లెజెండ్’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ
చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలవడమే కాదు.
కొన్ని కేంద్రాల్లో 1000
రోజులకు పైగా నడిచి రికార్డు క్రియేట్ చేసింది. డిజిటల్ యుగంలో కూడా ఒకే థియేటర్‌లో
ఇన్ని రోజులు నడిచిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ‘లెజెండ్’ సినిమా తర్వాత
బాలకృష్ణ ప్రతి యేడాది తన సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ వచ్చారు. తాజాగా కరోనా
నేపథ్యంలో బాలయ్యకు 2020 జీరో రిలీజ్ ఇయర్ అయ్యేలా తప్పడం లేదు. ప్రస్తుతం
చిత్రీకరణ దశలో ఉన్న BB3 సినిమాను వచ్చే యేడాది సమ్మర్‌లో విడుదల చేసేలా
ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి చాలా పనులు పెండింగ్‌లో
ఉన్నాయి.
బాలయ్య సోలో హీరో అయ్యాక
రిలీజ్ 2013లో
జరిగింది. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘లెజెండ్’ సినిమాతో పలకరించాడు.
ఇపుడు 2020 జీరో
రిలీజ్ తప్పడం లేదు. ఇక సెకండ్ జీరో రిలీజ్ తర్వాత వస్తోన్న చిత్రానికి కూడా
బోయపాటి శ్రీను దర్శకుడు కావడం విశేషం. గతంలో బాలకృష్ణ, బోయపాటి
శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు సమ్మర్‌నే టార్గెట్ చేస్తూ రిలీజై
సంచలన విజయాలు నమోదు చేసాయి. ఇపుడు అదే తరహాలో 2021లో బాలయ్య, బోయపాటి
శ్రీను సినిమా వేసవినే టార్గెట్‌గా రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం. ఆ రెండు
సినిమాలు లాగా ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. ఈ
సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.