బిగ్ బాస్ సోహెల్ కు ఘనస్వాగతం పలికిన అభిమానులు
By: Sankar Sun, 27 Dec 2020 09:33 AM
బిగ్ బాస్ సీజన్లో ఫోర్ లో టాప్ త్రి లో ఒకడిగా నిలిచినా కంటెస్టెంట్ సోహెల్ ...బిగ్ బాస్ విన్నర్ కాలేకపోయినప్పటికీ తన ప్రవర్తనతో బయట ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు సోహెల్ ..మెగాస్టార్ చిరంజీవి అంతటివాడే సోహెల్ మీద ప్రశంసలు గుప్పించాడు...అయితే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత తొలి తన సొంత ఊరుకు బయలుదేరిన సోహెల్ కు మార్గం మధ్యలో హుస్నాబాద్ లో అభిమానులు ఘనస్వాగత పలికారు...
వరంగల్ నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న సోహైల్‌కు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో అభిమానులు స్వాగతం పలికారు. కొద్ది సేపు ఆగి వారితో మాట్లాడారు. కాగా సోహైల్‌కు స్నేహితుడు ఒకరు అతని వాహనంలో ప్రయాణించడంతో.. స్నేహితుడి స్వగ్రామం హుస్నాబాద్ కావడంతో అతని కోరిక మేరకు హుస్నాబాద్ నుంచి వెళ్దామని కోరడంతో సోహైల్ వరంగల్ నుంచి హుస్నాబాద్ మీదుగా కరీంనగర్‌కు వెళ్లేందుకు పయనమయ్యాడు.
అప్పటికే తన స్నేహితుడి సమాచారం మేరకు అయనను కలుసుకునేందుకు హుస్నాబాద్ పట్టణంలో అభిమానులు సిద్ధమయ్యారు. అంబేడ్కర్ చౌరస్తాలో సోహైల్‌కు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు...