హీరో రామ్ రెడ్ మూవీ విడుదల తేదీ...!
By: Anji Mon, 21 Dec 2020 1:52 PM
ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ కథానాయకుడిగా నటించిన సినిమా రెడ్. కోలీవుడ్ మూవీ తాడమ్ కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో రామ్ ద్విపాత్రాభినయం చేశారు.
నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ తరువాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటించిన ఈ హ్యాట్రిక్ ఎటెంప్ట్ కి.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందించారు. ఇందులో రామ్ కి జోడీగా నేల టికెట్ ఫేమ్ మాళవికా శర్మ, నివేదా పెతురాజ్, అమృత అయ్యర్ నాయికలుగా నటించారు.
ఇదిలా ఉంటే.. రెడ్ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే రామ్ అండ్ టీమ్ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం.. జనవరి 15న రెడ్ థియేటర్స్ లో సందడి చేసే అవకాశముందని తెలిసింది.
అతి త్వరలో విడుదల తేదిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. సంక్రాంతి సీజన్ లో రామ్ హీరోగా నటించిన దేవదాసు, మస్కా, నేను శైలజ చిత్రాలు విడుదలై మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో.. రెడ్ కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.