మరొకసారి దుమ్ములేపిన రామ్ మణిశర్మ కాంబో ..రెడ్ సినిమా నుంచి మాస్ సాంగ్ రిలీజ్
By: Sankar Wed, 30 Dec 2020 8:27 PM
టాలీవుడ్ యంగ్ హీరో రామ్, నివేదా పేతురాజ్ , మాళవికాశర్మ, అమృతా అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘రెడ్’ చిత్రం జనవరి 14 న సంక్రాంతి కానుకగా విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. తిరుమల కిశోర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇదిలా ఉంటే, ఈ చిత్రం నుంచి మంచి మాస్ సాంగ్‌ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. రామ్, హెబ్బా పటేల్‌పై చిత్రీకరించిన ఈ స్పెషల్ మాస్ సాంగ్ లిరికల్ వీడియోను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది చిత్ర నిర్మాణ సంస్థ. మెలోడి బ్రహ్మ మణిశర్మ స్వరపరిచిన ఈ మాస్ సాంగ్ అదిరిపోయింది.
ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న రామ్ ఇప్పుడు రెడ్ సినిమాతో అది మరింత పెంచుకోవాలని ఆశిస్తున్నాడు...ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాకు కూడా మణిశర్మ నే మ్యూజిక్ కావడంతో ఈ రెడ్ సినిమా మ్యూజిక్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి..