ఫాదర్స్ డే సందర్బంగా ట్వీట్ చేసిన చిరంజీవి
By: chandrasekar Mon, 22 June 2020 5:12 PM
బిడ్డ భవిష్యత్తు కోసం
నిస్వార్థంగా అహర్నిశలు కష్టపడే మహా మనిషి తండ్రి. నాన్నంటే ఓ ధైర్యం నాన్నంటే ఓ
భద్రత, బిడ్డ
గెలిచినప్పుడు పదిమందికి చెప్పుకునే వ్యక్తి, ఓడినప్పుడు భుజాలపై ఎత్తుకొని ఆ బాధను దిగమింగుతూ
బిడ్డకు దైర్యం చెప్పేది తండ్రి మాత్రమే. అలాంటి నాన్న గొప్పతనం, త్యాగాలను
స్మరించుకోడానికి పుట్టిందే ‘పితృ దినోత్సవం’ (ఫాదర్స్ డే). ఆదివారం ఫాదర్స్ డే.
ఫాదర్స్ డే సందర్భంగా
పలువురు సినీ ప్రముఖులు తండ్రితో జ్ఞాపకాలను స్మరించుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ ఆసక్తికర ఫొటో షేర్ చేశారు.
ఓ కొడుకుగా తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని, ఓ తండ్రిగా తన కొడుకుతో ఉన్న అనుబంధాన్ని గుర్తి
చేస్తూ మెసేజ్ పోస్ట్ చేశారు.
ఈ మేరకు మనవడు రామ్‌చరణ్
తేజ్‌ను తన తండ్రి వెంకట్రావు ఎత్తుకున్న ఫొటోను అభిమానులతో పంచుకుంటూ ''మై
చార్మింగ్ డాడ్‌తో చిరుత'' అని పేర్కొంటూ 'మా నాన్న నవ్వు నా బిడ్డ చిరునవ్వు రెండు నాకు చాలా
ఇష్టం' అని
ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ చూసిన మెగా ఫ్యాన్స్ హ్యాపీ ఫాదర్స్ డే అంటూ సోషల్
మీడియాను హోరెత్తిస్తున్నారు. మెగాస్టార్ 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150'
ఆయన సినిమా నిర్మాణ బాధత్యలను స్వయంగా చూసుకుంటున్న
రామ్ చరణ్ ఇటీవలే 'సైరా నరసింహా రెడ్డి' మూవీ రూపొందించి తండ్రి
చిరకాల కోరిక నెరవేర్చారు.
ప్రస్తుతం మెగాస్టార్ 152 మూవీ 'ఆచార్య' సినిమాకు
కూడా రామ్ చరణ్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో
పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.