దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా ఫ్యామిలీలో కరోనా కలకలం
By: Sankar Wed, 09 Dec 2020 6:45 PM
కరోనా మహమ్మారి అనేది ప్రపంచ వ్యాప్తంగా కేవలం సామాన్య జనాలను మాత్రమే కాకుండా సెలెబ్రిటీలు , రాజకీయవేత్తలు వంటి వారిని కూడా వదలలేదు ..ఈ కరోనా మహమ్మారి కారణంగా అనేక మంది సెలెబ్రిటీలు తమ ప్రాణాలను కూడా కోల్పోయారు...తాజాగా కన్నడ సినీ పరిశ్రమలో కరోనా కలకలం రేపింది ..
ఇటీవల గుండెపోటు కారణంగా మరణించిన కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ కరోనా బారిన పడ్డారు. వారి చిన్నారి కుమారుడికి కూడా కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని మేఘనా రాజ్ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తమ ఆరోగ్యం నిలకడగానే ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు.. ఇన్‌స్టాగ్రామ్‌లో మంగళవారం నోట్ షేర్ చేశారు.
హలో.. మా అమ్మానాన్న, నాకు, నా కుమారుడికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది... గత కొన్ని వారాలుగా మమ్మల్ని కలిసిన వారు కూడా పరీక్షలు నిర్వహించుకోవాలని కోరుతున్నాం.. ప్రస్తుతం మేం చికిత్స పొందుతున్నాం.. చిరు అభిమానులకు ఓ విజ్ఞప్తి.. జూనియర్ చిరు ఆరోగ్యం బాగుంది. నేనెల్లప్పుడూ తనతోనే ఉంటున్నా.దయచేసి ఎవరూ ఆందోళన చెందవద్దు.. మహమ్మారిపై యుద్ధంలో మా కుటుంబం గెలుపొందుతుంది. వైరస్‌ను జయిస్తాం’’ అని మేఘన పేర్కొన్నారు.