కరోనా పాజిటివ్ బారిన పడిన బాలీవుడ్ హీరోయిన్
By: Sankar Tue, 08 Dec 2020 10:39 AM
వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆతర్వాత బాలీవుడ్ లో పాగా వేసిన హీరోయిన్ కృతి సనన్ తాజాగా కరోనా బారిన పడ్డారు...
ఇటీవల జుగ్ జుగ్ జియో చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న వరుణ్ ధావన్, నీతూ కపూర్, రాజ్ మెహతాలకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కాగా, తాజాగా కృతిసనన్‌కు కూడా కరోనా సోకినట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఈ అమ్మడు రాజ్‌కుమార్ రావు సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చంఢీఘర్ నుండి ముంబై వచ్చింది.
అందుకు సంబంధించిన పోస్ట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. కృతి సనన్‌కు కరోనా పాజిటివ్ అని వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Tags :
tested |
positive |