అల ..వైకుంఠపురంలో సినిమా మీద ప్రశంసలు కురిపించిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ...
By: Sankar Sun, 12 July 2020 8:48 PM
ఈ సంక్రాంతికి తెలుగులో రిలీజ్ అయినా అల..వైకుంఠపురం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిన విషయమే ..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో వచ్చిన ఈ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది ..తాజాగా ఈ సినిమా మీద ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్త కామెంట్స్ చేసారు ..
అల వైకుంఠపురములో సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పుడే చూశాను. ఏం సినిమా అసలు! స్వచ్ఛమైన వినోదం. ఈ సినిమాను థియేటర్‌లో చూడకపోతే ఆ లోటు జీవితాంతం ఉండిపోతుంది. ప్రస్తుత భయాందోళన పరిస్థితులను అధిగమించి వీలైనంత త్వరగా ఈ సినిమాను థియేటర్‌లో చూడాలి’’ అని గుప్తా శనివారం ట్వీట్ చేశారు. సంజయ్ గుప్తా ట్వీట్‌కు అల్లు అర్జున్ స్పందించారు. ‘‘థాంక్యూ వెరీ మచ్ సంజయ్ గారు. సినిమా మీకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది’’ అని బన్నీ రిప్లై ఇచ్చారు.
అల్లు అర్జున్ రిప్లైకి మళ్లీ సంజయ్ గుప్తా స్పందించారు. అల్లు అర్జున్‌కు తాను పెద్ద ఫ్యాన్‌గా సంజయ్ అభివర్ణించారు. ‘‘సోదర, మీ పెర్ఫార్మెన్స్ చూసి నేను ఎంతలా అనుభూతి చెందానో మీకు తెలీదు. మీరు నన్ను నవ్వించారు, ఏడిపించారు. జీవితాంతం నేను మీ అభిమానిని. మీతో పనిచేయడానికి ఒక్క అవకాశం కోసం వేచిచూస్తున్నా’’ అని సంజయ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ‘కాంటే’, ‘షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా’. ‘జజ్బా’, ‘కాబిల్’ వంటి చిత్రాలతో సంజయ్ గుప్తా దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.