బాలీవుడ్ ప్రముఖ దర్శకుడికి కరోనా పాజిటివ్ ..ఆందోళనలో ధనుష్ అభిమానులు
By: Sankar Thu, 31 Dec 2020 2:17 PM
బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన గురువారం నాడు ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. తనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు కనిపించడం లేదని, ప్రస్తుతం బాగానే ఉన్నట్లు తెలిపారు.
అధికారుల సూచన మేరకు క్వారంటైన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. తనను కలిసినవారు కూడా క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా కోరారు. ఆనంద్ రాయ్‌కు కరోనా రావడంతో ఆయన డైరెక్షన్ చేస్తున్న 'ఆత్రంగి రే' యూనిట్‌లో కలవరం మొదలైంది..
ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధనుష్, అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ధనుష్ పాత్ర చిత్రీకరణ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ నిన్న కేక్ కటింగ్ చేసింది. ఈ వేడుకలో దర్శకుడి వెంట ధనుష్, సారా అలీఖాన్ కూడా ఉండటంతో వారి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.