Advertisement

  • టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్ స్టార్ బ్యూటీ

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్ స్టార్ బ్యూటీ

By: Sankar Wed, 19 Aug 2020 3:13 PM

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్ స్టార్ బ్యూటీ


బాలీవుడ్ అందాల తార ఊర్వశి రౌతేలా టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయింది. సంప‌త్ నంది స్నేహితుడు మోహ‌న్ భ‌రద్వాజ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం బ్లాక్ రోస్‌. ఊర్వ‌శి రూటేలా లీడ్ రోల్ లో న‌టిస్తోంది. డైరెక్ట‌ర్ గా కెరీర్ ను షురూ చేస్తోన్న‌ ప్రియ‌మైన స్నేహితుడు మోహ‌న్ భ‌ర‌ద్వాజ‌కు గుడ్ ల‌క్‌.

నా నిర్ణయం స‌రైన‌దేన‌ని మీరంతా విశ్వ‌సిస్తార‌ని న‌మ్ముతున్నా. శ్రీనుకు ధ‌న్యవాదాలు. నా మీద న‌మ్మ‌క‌ముంచి డైరెక్ట‌ర్ గా మోహ‌న్ భ‌ర‌ద్వాజ‌కు అవ‌కాశ‌మిచ్చిన ప‌వ‌న్ కు కృత‌జ్ఞ‌త‌లు. వారికి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటానని సంప‌త్ నంది ట్వీట్ చేశారు. ఊర్వశి రౌతేలా , మోహ‌న్ భ‌ర‌ద్వాజ‌తో ఇత‌ర బృందంతో క‌లిసి ఫొటోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు.

ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంద‌నే విష‌యంపై త్వ‌ర‌లో క్లారిటీ రానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం తెర‌కెక్కించేందుకు సంప‌త్ నంది ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది.మాజీ మిస్ యూనివ‌ర్స్ కంటెస్టంట్ అయిన ఈ బ్యూటీ గ్రేట్ గ్రాండ్ మస్తీ, కాబిల్, హేట్ స్టోరీ 4, హీరోపాంటీ, స‌న‌మ్ రే వంటి చిత్రాల్లో న‌టించింది. సంప‌త్ నంది ఈ చిత్రానికి బ్లాక్ రోజ్ అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నాడ‌ని టాక్‌.Tags :
|
|

Advertisement