Bigg Boss 4: నామినేషన్ల పర్వం...!
By: Anji Tue, 03 Nov 2020 08:33 AM
బిగ్‌బాస్ 4లో తొమ్మిదో వారానికి గానూ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మామూలుగా ప్రతి వారం నామినేషన్ ఒక్క రోజు మాత్రమే ఉండనుండగా.. ఈసారి రెండు ఎపిసోడ్లకు చేరింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా కోడిగుడ్ల మోత మోగింది.
నామినేషన్‌లో భాగంగా మొదట అరియానా వచ్చి హారికపై మొదటి గుడ్డు కొట్టింది. రాక్షసుల టాస్క్‌లో హారిక ప్రవర్తన నచ్చలేదని అందుకే నామినేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక రెండో గుడ్డును అందరూ ఊహించనట్లే సొహైల్‌పై కొట్టింది.
కెప్టెన్‌గా పనిష్మెంట్ ఇస్తే చేయను అన్నావు. అందుకే నిన్ను నామినేట్ చేశా అని చెప్పింది. ఆ సమయంలో ఆ ఇద్దరి మధ్య కాసేపు రచ్చ జరిగింది. ఇది గలీజ్ నామినేషన్ అంటూ అరియానాపై చిందులు తొక్కాడు సొహైల్.
ఇక రెండో వ్యక్తిగా అవినాష్ పేరును బిగ్‌బాస్ చెప్పగా.. అతడు మొదటి గుడ్డును అభిజిత్‌పై కొట్టాడు. నోయల్ చిల్లర కామెడీ అన్నప్పుడు అభి లేచి సీరియస్ అవ్వడం తనకు నచ్చలేదని అవినాష్ అన్నాడు. ఇక రెండో గుడ్డును హారికపై పగలగొట్టి.. కేర్‌టేకర్ టాస్క్‌లో సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేదని చెప్పాడు.
మూడో వ్యక్తిగా సొహైల్ రాగా.. నాకు అరియానాను నామినేట్ చేయాలని ఉంది. కానీ ఆమె కెప్టెన్ కావడంతో చేయట్లేదు. నెక్ట్స్ వీక్ ఆమె ఉంటే చేస్తా అని చెప్పాడు. ఆ తరువాత మొదటి గుడ్డును మోనాల్ తలపై పగలగొట్టాడు.
నీ వలనే అఖిల్‌కి, తనకి మధ్య మనస్పర్థలు వస్తున్నాయని, అలాగే టాస్క్‌లలో బాగా ఆడటం లేదని సొహైల్ చెప్పాడు. ఇక రెండో గుడ్డుగా అభిజిత్‌పై కొట్టి.. తనకు అబద్దాల కోరు అని ట్యాగ్ ఇచ్చినప్పుడు.. నువ్వు వచ్చి నీకు అన్ని సెట్ అవుతాయి అని అన్నావు.
అందుకే నామినేట్ చేశా అని చెప్పాడు. అయితే తాను మంచి చెబితే నువ్వు మరోలా రిసీవ్ చేసుకున్నావు అని అన్న అభి.. ఇకపై నువ్వు నా మీద జోకులు వేయకు.. నేను నీ మీద వేయను అని అభి అన్నాడు.
తరువాత వచ్చిన అభిజిత్.. మొదట అవినాష్‌పై గుడ్డు పగలగొట్టాడు. నువ్వు ఎప్పుడూ నేను ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తా. హెల్దీ కామెడీ చేస్తా అని అంటావు. కానీ నాకు అలా అనిపించదు. నువ్వు కామెడీ చేయడానికి వచ్చి ఉండొచ్చు.
కానీ దాన్ని కామెడీగా తీసుకోవడానికి మేము రెడీగా లేవు. కామెడీ ఆపేస్తే బావుంటుంది అని అవినాష్‌కి చెప్పాడు. దీంతో అవినాష్ కూడా రెచ్చిపోయాడు. నేను వినోదం చేసేందుకు ఇక్కడు వచ్చా.
కమెడియన్‌గా ఎంటర్‌టైన్ చేయడానికే వచ్చ. ప్రాణం పోయేవరకు పర్ఫామెన్స్ చేస్తా. నన్ను కామెడీ చేయొద్దని చెప్పడానికి నువ్వు ఎవడివి అంటూ ఫైర్ అయ్యాడు. అక్కడితో సోమవారం ఎపిసోడ్ పూర్తవ్వగా.. ఇవాళ ఎపిపోడ్‌లో నామినేషన్ల పర్వం కొనసాగనుంది.