Advertisement

  • రౌడీ హీరోతో బిగ్ బాస్ విన్నర్ ..వైరల్ అవుతున్న ఫోటోలు

రౌడీ హీరోతో బిగ్ బాస్ విన్నర్ ..వైరల్ అవుతున్న ఫోటోలు

By: Sankar Mon, 28 Dec 2020 12:56 PM

రౌడీ హీరోతో బిగ్ బాస్ విన్నర్ ..వైరల్ అవుతున్న ఫోటోలు


బిగ్ బాస్ సీజన్ ఫోర్ విజేతగా నిలిచిన అభిజీత్ బయటకు వచ్చిన తర్వాత తనకు మద్దతుగా నిలిచినవారిని కలుస్తున్నాడు..ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబును మీట్ అయినా అభిజీత్ తాజాగా తన స్నేహితుడు , టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండను కలిసాడు..ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయితున్నాయి..

బిగ్‌బాస్ ఫైనల్‌కి ముందుకు అభిజిత్‌కు మద్దతు ప్రకటిస్తూ విజయ్ ట్వీట్ చేశారు. దీంతో తన విజయంలో విజయ్ పాత్ర కూడా ఉందని తెలుసుకున్న అభిజిత్.. తన స్నేహితుడిని కలుసుకుని ధన్యవాదాలు చెప్పాడు. మరోవైపు క్రిస్మస్ రోజున శాంతాక్లాజ్‌ అవతారమెత్తిన అభిజిత్ అనాథ శరణాలయానికి వెళ్లి అక్కడి పిల్లలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాడు. వారికి సర్‌ప్రైజ్‌ గిఫ్టులు అందజేశాడు.

కాగా అభిజీత్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అభిజీత్ హీరోగా నటించగా విజయ్ దేవరకొండ ఒక చిన్న పాత్ర చేసిన విషయం తెలిసిందే..ఆ సినిమా తర్వాత విజయ్ వరుస హిట్లతో సూపర్ స్టార్ అవ్వగా , అభిజీత్ మాత్రం కొంచెం వెనుకబడ్డాడు ..ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ తో మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టే అవకాశం ఉంది...

Tags :
|
|

Advertisement