బిగ్ బాస్ పై ఫైర్ అయితున్న అభిజీత్ ఫ్యాన్స్
By: Sankar Mon, 21 Dec 2020 10:40 AM
బిగ్ బాస్ సీజన్ 4 ఘనంగా ముగిసింది ..అందరు ఊహించినట్లే అభిజీత్ విన్నర్ గా నిలిచాడు ...అయితే ఇక్కడే అభిమానులు బిగ్ బాస్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు...విన్నర్ గా నిలిచిన అభిజీత్ కన్నా మూడో స్థానంలో నిలిచిన సోహెల్ ఎక్కువ మనీ విన్ అవ్వడం ఏంటి అని విమర్శిస్తున్నారు..
కష్టపడి ఓట్లేస్తే ఇంత చెత్తగా ఆలోచిస్తారా అని కామెంట్లు చేస్తున్నారు. జీవితంలో మరోసారి బిగ్‌బాస్ చూసేది లేదని, కంటెస్టెంట్లకు ఓట్లు వేయమని తెగేసి చెప్తున్నారు. విన్నర్ అభిజిత్ రూ.25 లక్షలు మాత్రమే దక్కాయని, సెకండ్ రన్నరప్ సోహైల్‌కు అంతకన్నా ఎక్కువ మొత్తం, ఇంకా బెనిఫిట్స్ అందాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దాంతోపాటు మెహబూబ్‌కు మెగాస్టార్ చిరంజీవి రూ.10 లక్షల చెక్ ఇవ్వడం గొప్ప విషయమని చెప్తూనే.. మిగతా కంటెస్టెంట్లు అరియానా, అవినాష్, హారిక పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. హోస్ట్ నాగార్జున కూడా ఒకవైపే మొగ్గు చూపారని ఆరోపిస్తున్నారు.