Advertisement

  • బిగ్ బాస్ ఫాన్స్ కు కొత్త అప్డేట్ ...ఇక నుంచి టైమింగ్స్ మార్పు

బిగ్ బాస్ ఫాన్స్ కు కొత్త అప్డేట్ ...ఇక నుంచి టైమింగ్స్ మార్పు

By: Sankar Fri, 04 Dec 2020 9:07 PM

బిగ్ బాస్ ఫాన్స్ కు కొత్త అప్డేట్ ...ఇక నుంచి టైమింగ్స్ మార్పు


తెలుగులో బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది ..ప్రస్తుతం ఫినాలే కు వెళ్లే టాస్క్ నడుస్తుంది...ఫైనల్ దశకు చేరుకోవడంతో ఉన్న ప్రతి కంటెస్టెంట్ తమ నుంచి 100 శాతం ప్రదర్శన ఇస్తున్నారు... ఇలాంటి సమయంలో స్టార్ మా సంచలన నిర్ణయం తీసుకుంది. బిగ్ బాస్ టైమింగ్స్ మారుస్తూ తాజాగా యాడ్స్ విడుదల చేసారు.

ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 నిమిషాలకు ప్రసారం అవుతుంది.. వీకెండ్ ఎపిసోడ్స్ మాత్రం రాత్రి 9 గంటల నుంచి 10:30 వరకు వస్తున్నాయి. కానీ ఇప్పుడు డిసెంబర్ 7 నుండి రాత్రి 10 గంటలకు బిగ్ బాస్ వస్తుందని తెలుస్తుంది.

ఈ మేరకు ఇప్పుడు బిగ్ బాస్ ప్రసారం అవుతున్న సమయంలో వదినమ్మ సీరియల్ రాబోతుంది. అది రాత్రి 7 గంటలకు వచ్చేది.. ఇప్పుడు ఆ సీరియస్ ప్లేస్‌లో గుప్పెడంత మనసు అనే కొత్త సీరియల్ ప్రారంభం అవుతుంది. దాంతో బిగ్ బాస్ టైమింగ్స్ మారిపోతున్నాయి. డిసెంబర్ 20న బిగ్ బాస్ 4 తెలుగు ముగియనుంది.

Tags :
|
|

Advertisement