సుమ , అనసూయలకు పోటీగా వస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్
By: Sankar Wed, 30 Sept 2020 4:05 PM
హీరో వరుణ్ సందేశ్ తన భార్య వితికా షెరుతో కలిసి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు. వరుణ్ సందేశ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే అయినా వితిక పెద్దగా ఎవరికీ తెలీదు. ఆమె కూడా హీరోయిన్‌గా సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ, బిగ్ బాస్ షోలో పాల్గొన్న తరవాత వితికాకు మంచి గుర్తింపు వచ్చింది.
ఇక బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన తరవాత ఇంటర్వ్యూలతో బిజీ అయిపోవడమే కాకుండా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.బిగ్ బాస్ షోలో పాల్గొన్న సుమారు ఏడాదిన్నర తరవాత ఇప్పుడు వితికా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు.
అది కూడా తనకు ఎంతో ఇష్టమైన యాంకర్‌గా. యాంకరింగ్ అంటే తనకు చాలా ఇష్టమని, యాంకర్ కావడం తన గోల్ అని గత ఇంటర్వ్యూలలో వితిక చెప్పారు. ఇప్పుడు ఆ కలను ఆమె నెరవేర్చుకున్నారు. ఈటీవీలో ప్రతి ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రసారం కానున్న ‘సామజవరగమన’ షోకి వితిక యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఆదివారం (అక్టోబర్ 4) నుంచి ఈ షో ప్రసారం కానుంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం యాంకర్ సుమ, అనసూయ బుల్లితెరను ఏలుతున్నారు. శ్రీముఖి, రష్మి కూడా సత్తా చాటుతున్నారు. వీళ్ల మధ్య పోటీని వితికా షెరు తట్టుకోగలరా లేదా చూడాలి. వీళ్ల కన్నా కొత్తగా ఉంటేనే వితికను ప్రేక్షకులు ఆదరిస్తారు. వితిక అందానికి ఆమె వాక్‌చాతుర్యం జత అయితే ఒక మంచి యాంకర్‌గా ఎదగడానికి ఎంతో సమయం పట్టదు.