బిగ్ బాస్ సోహెల్ హీరోగా సినిమా షురూ ...
By: Sankar Thu, 24 Dec 2020 10:49 AM
బిగ్ బాస్ లో తన సహజ క్యారెక్టర్ తో అందరి మనసులను గెలుచుకున్న వ్యక్తి సోహెల్ ..మొదటి నుంచి చివరి వరకు ఒకేలాగా ఉన్న సోహెల్ టాప్ త్రి లో నిలిచాడు..సోహెల్ క్యారెక్టర్ కు బయట జనాలు ఫిదా అయ్యారు..దీనితో బిగ్ బాస్ ద్వారా సోహెల్ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు...దీనితో సోహెల్ కు సినిమా ఆఫర్స్ వస్తున్నాయి..
తాజాగా జార్జిరెడ్డి, ‘ప్రెజర్ కుక్కర్’ వంటి సినిమాలను నిర్మించిన అప్పిరెడ్డి.. సోహైల్ హీరోగా ఓ సినిమాని ప్రకటించారు. దీనికి శ్రీనివాస్ వింజనంపతి అనే కొత్త దర్శకుడు డైరెక్షన్ చేయబోతున్నారు. మైక్ మూవీస్ పతాకంపై భారీ లెవల్‌లో ఈ సినిమాని తెరకెక్కించనున్నారట. బిగ్‌బాస్‌తో వచ్చిన క్రేజ్‌ని ఈ సినిమాతో క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
సోహైల్ సినిమా తీస్తానంటే అందుకు తాను సపోర్ట్ చేస్తానని మెగాస్టార్ చిరంజీవి చెప్పిన సంగతి అందరికి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఫంక్షన్ తానే నిర్వహిస్తానన్నాడు..ఇక హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా సోహెల్ సినిమాలో ఫ్రీ గా నటిస్తా అని తెలిపిన విషయం తెలిసిందే...