ఆది కొత్త సినిమా శశి టీజర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
By: Sankar Wed, 23 Dec 2020 10:00 PM
టాలీవుడ్ సీనియర్ హీరో సాయి కుమార్ వారసుడిగా ప్రేమ కావాలి సినిమాతో తెరంగేట్రం చేసిన యువ నటుడు ఆది సాయి కుమార్ ..ఇటీవల సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్న ఆది కొత్తగా శశి అనే సినిమాలో నటిస్తున్నాడు...ఈ రోజు ఆది పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శశి సినిమా టీజర్ లాంచ్ చేసారు...
ఈ మూవీలో ఆది సాయికుమార్ సరసన సురభి, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఆర్.పి.వర్మ, సి.రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ చివరి దశకి చేరుకుంది.
లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో ఆది సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. `మన చివరి క్షణాలు చూస్తున్నప్పుడే మొదటి క్షణాలు గుర్తొస్తాయి`, `ఇష్టమైన పని చేయడానికి.. అవసరం కోసం పని చేయడానికి చాలా తేడా ఉంది` లాంటి డైలాగ్స్ ఈ టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి..