Advertisement

అడివి శేష్ 'మేజర్' సినిమా ఫస్ట్ లుక్ అవుట్

By: Sankar Thu, 17 Dec 2020 11:26 AM

అడివి శేష్ 'మేజర్' సినిమా ఫస్ట్ లుక్ అవుట్


తెలుగులో డిఫరెంట్ కథలతో దూసుకుపోతూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న నటుడు అడివి శేష్ ...తాజాగా శేష్ హీరోగా గా నటిస్తున్న మేజర్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల అయింది..26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ సందీప్‌ ఉన్ని కృష్షన్‌ జీవితం ఆధారంగా ‘మేజర్’‌ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

ఈ రోజు శేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ధైర్య సాహసాలు ప్రతిబింబించేలా `మేజర్` ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించింది చిత్ర యూనిట్‌. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ లుక్‌లో అడివి శేష్‌ను ప్రదర్శిస్తూ ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు `మేజర్` ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ను విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.

26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జ‌ర్నీని ప్రేక్ష‌కుల‌కుకి అందించ‌డ‌మే ఈ చిత్రం ముఖ్య ఉద్ధేశ్యం అని తెలిపారు దర్శకుడు. అతడు వీర మ‌ర‌ణం పొందిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం ఆత్మను సంగ్రహించే సన్నివేశాలను ఈ చిత్రం ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తోంది చిత్ర యూనిట్‌..

Tags :
|

Advertisement