ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ టెన్ మొబైల్స్ ఇవే
By: Sankar Thu, 10 Dec 2020 9:36 PM
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చేతిలో సెల్ ఫోన్ లేకుండా ఉండటం అంటే అది గగనమే అయిపొయింది ..కరోనా మహమ్మారి కారణంగా స్కూల్స్ మరియు కాలేజీలు కూడా ఆన్లైన్ లోనే పాఠాలు బోధిస్తుండటంతో ఈ ఏడాది మొబైల్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది...
భారత్‌లో లాక్‌డౌన్ తర్వాత పండుగ సీజన్ సందర్బంగా రికార్డు స్థాయిలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు జరిగాయి. ఆపిల్, వన్‌ప్లస్, షియోమీ, రియల్‌మీ తదితర ప్రముఖ కంపెనీలు భారత మార్కెట్లో నూతన ఫోన్లను విడుదల చేశాయి. 2020లో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను గూగుల్ విడుదల చేసింది.
అవి
1.వన్‌ప్లస్ నార్డ్
2. ఐఫోన్ 12
3. రియల్ మీ 7 ప్రో
4. రెడ్‌మీ నోట్ 8 ప్రొ
5. రెడ్‌మీ నోట్ 8
6.ఒప్పో ఎఫ్ 17 ప్రో
7. రెడ్‌మి నోట్ 9 ప్రో
8. వివో వీ20
9. రియల్ మీ 6ప్రో
10. రియల్ మీ 7