Advertisement

  • మరొక విప్లవాత్మక మార్పుకు నాంది పలకనున్న ముకేశ్ అంబానీ ..

మరొక విప్లవాత్మక మార్పుకు నాంది పలకనున్న ముకేశ్ అంబానీ ..

By: Sankar Wed, 15 July 2020 4:09 PM

మరొక విప్లవాత్మక మార్పుకు నాంది పలకనున్న ముకేశ్ అంబానీ ..



ముకేశ్ అంబానీ ..ఈ పేరు చెప్తే ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న కోటీశ్వరుడు అన్నది గుర్తొస్తుంది ..అయితే గత నాలుగు ఏళ్లుగా ముకేశ్ అంబానీ అంటే జియో అనేది కూడా గుర్తుకువస్తుంది ..అంతలా టెలికాం రంగంలో జియో తో చెరగని ముద్ర వేశారు ముకేశ్ అంబానీ ..అప్పటిదాకా ఉన్న టెలికాం సంసథలను అన్నిటిని వెనక్కు నెట్టి జియో ను అగ్రపథంలో దూసుకుపోయేలా చేసాడు ..అయితే ఆ తర్వాత జియో ఫోన్లను కూడా ప్రారంభించారు ..కాకపోతే స్మార్ట్ ఫోన్లు గా కాకుండా మాములు ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటిని తీసుకొచ్చారు ..

అయితే ఇకనుంచి మొబైల్ రంగంలో 5జీ సేవ‌ల‌ను త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్న‌ట్లు ఇవాళ రిల‌య‌న్స్ సంస్థ చైర్మ‌న్ ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. వ‌చ్చే ఏడాది నుంచి ప్ర‌యోగాత్మ‌కంగా 5జీ స‌ర్వీసులు అందుబాటులోకి వ‌స్తాయ‌ని ఆయ‌న చెప్పారు. అయితే భార‌తీయ క‌స్ట‌మ‌ర్ల‌ను దృష్టిలో పెట్టుకున్న జియో సంస్థ‌.. త్వ‌ర‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కూడా డెవ‌ల‌ప్ చేయ‌నున్న‌ది. గూగుల్ సంస్థ‌తో ఒప్పందం కుదుర్చుకున్న జియో.. 5జీ ఫోన్‌ను డిజైన్ చేసి మార్కెట్‌లోకి తీసుకురానున్న‌ట్లు ముఖేశ్ తెలిపారు. ఇవాళ ఏజీఎమ్‌ను ఉద్దేశిస్తూ ఆయ‌న మాట్లాడారు.

భార‌త్‌లో ఎక్కువ స్థాయిలో ఫీచ‌ర్ ఫోన్ యూజ‌ర్లు ఉన్నార‌ని, వారంత త‌క్కువ ధ‌ర‌కే వ‌చ్చే స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ కావాల‌నుకుంటున్నార‌ని ముఖేశ్ తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే గూగుల్‌తో క‌లిసి 4జీ లేదా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను త‌యారు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ప్ర‌స్తుత మార్కెట్ ధ‌ర ప్ర‌కారం ఆ స్మార్ట్‌ఫోన్‌ను త‌యారు చేయ‌గ‌ల‌మ‌న్నారు. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను గూగుల్‌తో క‌లిసి డెవ‌ల‌ప్ చేయ‌నున్న‌ట్లు ముఖేశ్ వెల్ల‌డించారు. జియో-గూగుల్ బంధం.. భార‌త్‌కు 2జీ నుంచి విముక్తి క‌ల్పిస్తుంద‌న్నారు. దేశంలో సుమారు 35 కోట్ల మంది 2జీ ఫీచ‌ర్ ఫోన్‌ను వాడుతున్నార‌ని, వారికి స‌ర‌స‌మైన ధ‌ర‌లోనే స్మార్ట్‌ఫోన్ అందిస్తామ‌న్నారు.

Tags :
|
|
|

Advertisement