Advertisement

ప్రతి నెల మీ అకౌంట్ లోకి 15,000...

By: Anji Fri, 18 Sept 2020 2:51 PM

ప్రతి నెల మీ అకౌంట్ లోకి 15,000...

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కస్టమర్లకు ఎన్నో రకాల పాలసీలు అందిస్తోంది. మనీ బ్యాక్, ఎండోమెంట్, పెన్షన్, చిల్డ్రన్, టర్మ్ ప్లాన్ ఇలా ఎన్నో రకాల పాలసీలు అందుబాటులో ఉంచింది. వీటి వల్ల కస్టమర్లకు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత లభిస్తుంది. ఎల్‌ఐసీ అందిస్తున్న పాలసీల్లో ఎల్‌ఐసీ జీవన్ శాంతి పాలసీ కూడా ఒకటి. ఉద్యోగం చేస్తున్న వారు ఈ పాలసీ తీసుకుంటే మంచి ప్రయోజనం పొందొచ్చు. రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా డబ్బులు లభిస్తాయి. దీంతో పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రాదు.


జీవన్ శాంతి పాలసీలో ఒకే సారి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. ఇది సింగిల్ యాన్యుటీ ప్లాన్. పాలసీ తీసుకోవడం వల్ల ప్రతి నెలా రూ.25,000 పెన్షన్ పొందొచ్చు. పాలసీ తీసుకునేటప్పుడు పెన్షన్ ఎలా పొందాలి అనే అంశానికి సంబంధించి రెండు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వెంటనే పెన్షన్ తీసుకోవడం ఒక ఆప్షన్.


కొంత కాలం తర్వాతి (5, 10, 15, 20 ఏళ్ల నుంచి) నుంచి పెన్షన్ తీసుకోవడం రెండో ఆప్షన్. ఉదాహరణకు మీకు 35 ఏళ్లు ఉన్నాయి. మీరు రూ.10 లక్షలు పెట్టి ఈ పాలసీ తీసుకున్నారు. 20 ఏళ్ల తర్వాతి నుంచి పెన్షన్ తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పుడు మీకు నెలకు రూ.14,700 పెన్షన్ వస్తుంది. అంటే మీకు 55 ఏళ్లు వచ్చిన దగ్గరి నుంచి ఎల్ఐసీ మీకు పెన్షన్ అందిస్తూ వస్తుంది.

Tags :
|
|

Advertisement